గురువారం 09 జూలై 2020
Cinema - May 27, 2020 , 16:07:12

గైడ్‌లైన్స్‌ ప్రకారమే ‘కరోనావైరస్’‌ షూటింగ్‌ : వర్మ

గైడ్‌లైన్స్‌ ప్రకారమే ‘కరోనావైరస్’‌ షూటింగ్‌ : వర్మ

ముంబై: టాలీవుడ్‌ డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ నిర్మాణంలో వస్తోన్న చిత్రం కరోనావైరస్‌. అగస్త్య మంజు డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశాడు వర్మ. అయితే ఓ వైపు లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా వర్మ సినిమా షూటింగ్‌ ఎపుడు, ఎలా చేశాడోనని ప్రేక్షకులు ఆలోచనలో పడ్డారు. సినిమా షూటింగ్‌ పై వర్మ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.

లాక్‌డౌన్స్‌ నిబంధనలు పాటిస్తూ కరోనావైరస్‌ సినిమాను చిత్రీకరించినట్లు తెలిపాడు. ఇది హార్రర్‌ సినిమా కాదు. మనతోపాటు గొప్పగొప్ప రాజకీయ వేత్తలు, అధికారుల్లో అంతర్గతంగా ఉన్న భయానక విషయాలను గురించి చెప్పే కథాంశం అని వర్మ చెప్పాడు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo