శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Oct 18, 2020 , 01:05:17

రాజశేఖర్‌ కుటుంబానికి కరోనా

రాజశేఖర్‌ కుటుంబానికి కరోనా

చిత్రసీమలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా సీనియర్‌ హీరో రాజశేఖర్‌ కుటుంబం కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ‘నాతో పాటు       జీవితకు..మా ఇద్దరు కుమార్తెలు శివానీ, శివాత్మికకు కరోనా నిర్ధారణ జరిగిన విషయం నిజమే. ప్రస్తుతం మేము ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాం. మా కుమార్తెలిద్దరు పూర్తిగా కోలుకున్నారు. నేను, జీవిత కాస్త అస్వస్థతతో ఉన్నాం. త్వరలో మేమిద్దరం కూడా కోలుకొని ఇంటికి చేరుకుంటాం. అందరికి ధన్యవాదాలు’ అని రాజశేఖర్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రాజశేఖర్‌ కుటుంబం త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని ఆకాంక్షిస్తూ అభిమానులు సందేశాలు పెడుతున్నారు.