బుధవారం 30 సెప్టెంబర్ 2020
Cinema - Aug 07, 2020 , 17:59:55

టాలీవుడ్‌ హీరో పెళ్లిలో కరోనా కలకలం

టాలీవుడ్‌ హీరో పెళ్లిలో కరోనా కలకలం

ఇటీవల ఓ యంగ్ హీరో పెళ్లితో ఓ ఇంటివాడయ్యాడు.. పలుసార్లు వాయిదాలు పడుతూ వచ్చిన ఆ యువహీరో వివాహం అట్టహాసంగా జరిగింది. ఆ హీరోకు అత్యంత సన్నిహితులైన పలువురు హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఆ పెళ్లికి హాజరయ్యారు. సెల్ఫీలతో హంగామా చేశారు. ఇటీవల ఆ యువ కథానాయకుడు ఓ విజయన్ని కూడా అందుకోవడంతో ఆ హీరో డేట్స్‌ అవసరమైన నిర్మాతలు, దర్శకులు కూడా పెళ్లి వద్ద సందడి చేశారు. అయితే ఆ పెళ్ళిలో అతిథులు ఎవరూ కూడా మాస్క్‌ ధరించి కనిపించలేదు.

సదరు ఫోటోలు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. అంతా బాగానే వుంది అనుకుంటున్న తరుణంలో ఆ పెళ్లికి హాజరైన పలువురు ఇప్పుడు కరోనా బారిన పడ్డారని తెలిసింది. దీంతో ఆ వివాహానికి హాజరైన మిగతా వారిలో కూడా కంగారు మొదలైంది. దీంతో అందరూ టెస్టులకు క్యూ కడుతున్నారు. అయితే పెండ్లికి హాజరైన వారు మాస్క్‌, భౌతికదూరం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించ‌డమే ఇందుకు కారణమని తెలుస్తోంది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo