సోమవారం 25 మే 2020
Cinema - Apr 01, 2020 , 17:23:08

వ‌ర్మ‌ 'కనిపించని పురుగు క‌రోనా'.. ఫుల్ సాంగ్ విడుద‌ల‌

వ‌ర్మ‌ 'కనిపించని పురుగు క‌రోనా'.. ఫుల్ సాంగ్ విడుద‌ల‌

ప‌రిస్థితుల‌ని త‌న‌కి అన‌కూలంగా మ‌ల‌చుకొని వార్త‌ల‌లో నిలిచే వ్య‌క్తి రామ్ గోపాల్ వ‌ర్మ‌. ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా ప్రపంచమంతా వ‌ణికిపోతుంటే, వ‌ర్మ మాత్రం ప్ర‌తి రోజు క‌రోనాపై సెటైర్స్‌, సాంగ్స్, మీమ్స్ చేస్తూ నెటిజ‌న్స్‌కి కావ‌ల‌సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని అందిస్తున్నారు. అయితే ‘కరోనా వైరస్ పైన తానే రాసి, పాడిన ‘కనిపించని పురుగు’ పాట ప్రోమో నిన్న విడుద‌ల చేయ‌గా, దీనికి బాగానే రెస్పాన్స్ వ‌చ్చింది

తాజాగా క‌నిపించ‌ని పురుగా క‌రోనా ఫుల్ సాంగ్ వీడియో విడుద‌ల చేశారు. ‘అది ఒక పురుగు.. కనిపించని పురుగు కరోనా అనే ఒక పురుగు.. నలిపేద్దాం అంటే అంత సైజు లేదు దానికి.. పచ్చడి చేద్దాం అంటే కండ లేదు దానికి దాని దాని బలం.. అదే దాని దమ్ము. కంటికి కనిపిస్తే దానమ్మ దాన్ని కత్తితో పొడవచ్చు.. ఉనికిని చూపిస్తే కింద బాంబు పెట్టి పేల్చొచ్చు.. బట్ ఇట్ ఈజ్ జస్ట్ పురుగు’ అంటూ  ఈ పాట‌తో వ‌ర్మ నెటిజ‌న్స్ చెవులో తుప్పు వదిలిస్తున్నారు. క‌రోనా క‌న్నా ఈ పాటే భ‌యంక‌రంగా ఉందంటూ కొంద‌రు నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా విడుద‌లైన సాంగ్‌పై మీరు ఓ లుక్కేయండి. 
ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు, క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo