గురువారం 01 అక్టోబర్ 2020
Cinema - Jul 25, 2020 , 22:01:47

హీరో విశాల్‌ తండ్రికి కరోనా పాజిటివ్‌

హీరో విశాల్‌ తండ్రికి కరోనా పాజిటివ్‌

చెన్నై : బిగ్ బి అమితాబచ్చన్ ఫ్యామిలీతో పాటు ఎందరో కరోనా మహమ్మారి బారిన పడ్డారు. కోలీవుడ్‌లో అర్జున్ ఫ్యామిలీకి సంబంధించిన కొందరికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. తాజాగా హీరో విశాల్ కుటుంబానికి కరోనా పాజిటివ్ అంటూ కోలీవుడ్‌లో వార్తలు వ్యాపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం ఉందా? లేదా? అనే డౌట్స్‌కి క్లారిటీ ఇస్తూ హీరో విశాల్ ట్వీట్ చేశారు. ‘ఆ వార్తలు నిజమే. మా నాన్నకి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఆయనకి సాయం చేసే క్రమంలో నాకు కూడా జ్వరం, జలుబు, దగ్గు వంటి కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి.

అలాగే ఇవే లక్షణాలు నా మేనేజర్‌లో కూడా ఉన్నాయి. మేమంతా ఆయుర్వేదిక్ మెడిసెన్ తీసుకుంటున్నాము. ఒక వారంలో ప్రమాదం నుంచి బయటపడతాము. ప్రస్తుతానికి మా ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఈ విషయం తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. గుడ్ బై’ అని విశాల్ తన ట్విటర్‌లో పోస్టు చేశారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo