శుక్రవారం 29 మే 2020
Cinema - Mar 28, 2020 , 15:38:23

సినీ కార్మికుల సహాయం కోసం ప్రత్యేక చారిటీ

సినీ కార్మికుల సహాయం కోసం  ప్రత్యేక చారిటీ

కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి , దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు. నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు దృష్టి సారించారు. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో సి సి సి మనకోసం (క‌రోనా క్రైసిస్ చారిటీ మ‌న‌కోసం)  అనే సంస్థ‌ ఏర్పాటు

 చేశారు.  చిరంజీవి ఆధర్యంలో సురేష్ బాబు తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్‌.శంక‌ర్, సి క‌ల్యాణ్, దాము క‌లిసి చిన్న క‌మిటీగా ఏర్పాట‌యి సీసీసీ అనే సంస్థ ద్వారా చిత్ర ప‌రిశ్ర‌మ కార్మికుల సంక్షేమార్థం ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని నిర్ణయించారు. దీనికి నాందిగా మొద‌ట చిరంజీవి, నాగార్జున తలా  కోటి రూపాయ‌లు ప్రకటించారు. ఎన్టీఆర్ 25ల‌క్ష‌లు  విరాళాలంగా ప్ర‌క‌టించారు. వీరే కాకుండా ఎవ‌రైనా సినిమా ప‌రిశ్ర‌మ కార్మికుల‌ను ఆదుకోవ‌చ్చు. క‌రోనా మ‌హమ్మారి వ‌ల్ల ప‌లు స‌మ‌స్య‌ల‌కు లోన‌వుతున్న సినీ కార్మికుల సంక్షేమ‌మే ఈ సంస్థ ముఖ్య ఆశ‌యం. ఇందుకు ప్ర‌తి ఒక్క‌రూ స‌హ‌క‌రించాలి. అంద‌రం క‌లిస్తేనే కరోనాను, అది తెచ్చిన ఇబ్బందుల‌ను పార‌ద్రోల‌గ‌లమని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.


logo