శనివారం 06 జూన్ 2020
Cinema - May 21, 2020 , 22:43:04

వదంతులు నమ్మొద్దు

వదంతులు నమ్మొద్దు

రవితేజ కథానాయకుడిగా రమేష్‌వర్మ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్నది.  ఏ స్టూడియోస్‌ పతాకంపై హవీష్‌ ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నది. కోనేరు సత్యనారాయణ నిర్మాత.  ఈ సినిమా ఆగిపోయిందంటూ కొంతకాలంగా సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతున్నది.  ఈ వదంతులను నమ్మవద్దని నిర్మాత కోనేరు సత్యనారాయణ ప్రకటించారు. ఆయన  మాట్లాడుతూ ‘కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఈ సినిమా ఉంటుంది. రవితేజ ఇమేజ్‌కు తగినట్లుగా దర్శకుడు రమేష్‌వర్మ చక్కటి కథను సిద్ధం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ అమలుకారణంగా సినిమాకు సంబంధించిన పనులన్నీ నిలిచిపోయాయి.  తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్న వెంటనే చిత్రాన్ని ప్రారంభిస్తాం. భారీ బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా రూపుదిద్దుకోనున్నది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం’ అని తెలిపారు. logo