ఆదివారం 29 నవంబర్ 2020
Cinema - Oct 26, 2020 , 19:13:25

' ది ఓల్డ్ టౌన్ క్రిమిన‌ల్స్' వెబ్ సిరీస్ పై పీఎస్ లో ఫిర్యాదు

' ది ఓల్డ్ టౌన్ క్రిమిన‌ల్స్' వెబ్ సిరీస్ పై పీఎస్ లో ఫిర్యాదు

ఇన్ఫోసిస్ ఫౌండేష‌న్ చైర్ ప‌ర్స‌న్ సుధామూర్తిపై వెబ్ సిరీస్ లో అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారంటూ న‌మ్మ క‌ర్ణాట‌క ర‌క్ష‌ణ వేదిక వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు జ‌య‌రాజ్ నాయుడు నందినీ లే అవుట్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు. 'ది ఓల్డ్ టౌన్ క్రిమిన‌ల్స్' వెబ్ సిరీస్ లో సుధామూర్తిని దుర్భాష‌లాడుతూ వీడియో పోస్ట్ చేసిన‌ డైరెక్ట‌ర్ అమ‌ర్, నిర్మాత మోహ‌న్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జ‌య‌రాజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే నందినీ లే అవుట్ పోలీస్ స్టేష‌న్ లో ఇప్ప‌టివ‌ర‌కు కేసు న‌మోదు చేయ‌న‌ట్టు తెలుస్తోంది.

ఎంతోమంది సాయం చేసిన సుధామూర్తిని వెబ్ సిరీస్ లో త‌క్కువ చేసి చూపించార‌ని, ఆమె త‌న భ‌ర్త డ‌బ్బుల‌తో న‌కిలీ దాతృత్వం చేసిన‌ట్టుగా పేర్కొనడం స‌రైంది కాద‌ని జ‌య‌రాజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.