బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Sep 17, 2020 , 17:28:09

కుంటాల సంద‌ర్శ‌న‌..బ‌న్నీ టీంపై ఫిర్యాదు..!

కుంటాల సంద‌ర్శ‌న‌..బ‌న్నీ టీంపై ఫిర్యాదు..!

టాలీవుడ్ యాక్ట‌ర్ అల్లు అర్జున్ ఇటీవ‌లే త‌న టీంతో క‌లిసి ఆదిలాబాద్ లోని కుంటాల వాట‌ర్ ఫాల్స్ ను సంద‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. అయితే కోవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో నిబంధ‌న‌లు ఉల్లంఘించారంటూ నేరెడగొండ పోలీస్‌స్టేష‌న్ లో అల్లు అర్జున్ పై కేసు న‌మోదైన‌ట్టు తెలుస్తోంది. స‌మాచార హ‌క్కు సాధ‌న స్ర‌వంతి (ఎస్హెచ్ఎస్ఎస్) ప్ర‌తినిధులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. కోవిడ్ నేప‌థ్యంలో కుంటాల వాటర్ ఫాల్స్ సంద‌ర్శ‌నను ప్ర‌భుత్వం నిలిపేసింది.

అయితే ఎస్ హెచ్ఎస్ఎప్ ప్ర‌తినిధుల ఫిర్యాదు ను స్వీక‌రించిన నేరెడిగొండ పోలీసులు ప్రాథ‌మిక ద‌ర్యాప్తు అనంత‌రం కేసు న‌మోదు చేస్తామ‌ని చెప్పార‌ట‌. అంతేకాదు పుష్ప చిత్ర‌బృందం నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా తిపేశ్వ‌ర్ వైల్డ్ లైఫ్ సాంక్చుయ‌రీలో షూటింగ్ చేశార‌ని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ ఫిర్యాదుల‌పై పుష్ప చిత్ర‌యూనిట్ ఇప్ప‌టివ‌ర‌కు స్పందించ‌లేదు. ఒక‌వేళ పోలీసులు కేసు న‌మోదు చేస్తే పుష్ప చిత్ర‌యూనిట్ న్యాయ‌మైన చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo