గురువారం 28 మే 2020
Cinema - May 09, 2020 , 09:58:59

చిక్కుల్లో స్టార్ హీరో..కేసు న‌మోదు

చిక్కుల్లో స్టార్ హీరో..కేసు న‌మోదు

త‌మిళ స్టార్  హీరో విజ‌య్ సేతుప‌తి ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళంలో వ‌రుస సినిమాలు చేస్తూ అల‌రిస్తున్నారు. మ‌క్క‌ల్ సెల్వ‌న్‌గా పిల‌వ‌బ‌డే విజ‌య్ సేతుప‌తి తాజాగా చేసిన కొన్ని సంచ‌ల‌న కామెంట్స్‌తో చిక్కుల్లో ప‌డ్డారు. ఆయ‌నపై  అఖిల భారత హిందూ సభ..త్రిచి పోలీస్ స్టేష‌న్  ప్రధాన కార్యాలయంలో కేసు న‌మోదు చేసింది. 

విజ‌య్ సేతుప‌తి మార్చి 17, 2019న స‌న్ టీవీలో ప్ర‌సార‌మైన న‌మ్మ ఊరు హీరో అనే కార్య‌క్ర‌మానికి చీఫ్ గెస్ట్‌గా హాజ‌ర‌య్యారు. ఆ కార్య‌క్ర‌మంలో హిందూ ఆల‌యంలో జ‌రిగే అభిషేకం, అలంక‌ర‌ణ‌, కైంక‌ర్యాల వంటి కార్య‌క్ర‌మాల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హిందూ దేవాల‌యాలలో దేవుడికి అభిషేకం చేసేట‌ప్పుడు భ‌క్తుల‌కి చూపిస్తారు. కాని వ‌స్త్రాలం‌క‌ర‌ణ జ‌రిగేట‌ప్పుడు మాత్రం మూసివేస్తారు. ఒక చిన్నారి కూడా త‌న తాత‌తో దేవుడికి స్నానం చేయించేట‌ప్పుడు చూపిస్తారు కాని వ‌స్త్రాలు వేసేట‌ప్పుడు అనుమ‌తించ‌రని అడిగిన‌ట్టు విజ‌య్ పేర్కొన్నారు. విజ‌య్ మాట‌ల‌కి హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తిన‌డంతో  త్రిచి పోలీస్‌స్టేషన్‌లో అఖిల భారత హిందూసభ సభ్యులు  విజయ్ సేతుపతిపై ఫిర్యాదు చేశారు. హిందూ ఆల‌యాల్లో జ‌రిగే ఆగ‌మ నియమాలపై విజ‌య్ సేతుప‌తి త‌ప్పుగా మాట్లాడటంపై నెటిజ‌న్స్ కూడా మండి ప‌డుతున్నారు.logo