బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదేమో. సీజన్ 2లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న కౌశల్‌కు ప్రత్యేక ఆర్మీ ఏర్పడి ఆయనను విజేతగా నిలిపేందుకు కృషి చేశారు. రీసెంట్గా కౌశల్ తన భార్య నీలియ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా, నెటిజన్స్ ఏం జరిగిందో చెప్పాలని కోరారు. ఈ క్రమంలో తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ నీలిమ సెల్ఫీ వీడియోను రిలీజ్ చేసింది.
ప్రస్తుతం నేను యూకేలో ఉద్యోగం చేస్తున్నాను. వారం క్రితం నాకు కరోనా సోకింది. ఇండియాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అందురు అనుకుంటారు. కాని ఇక్కడే ఘోరంగా ఉంది. పాజిటివ్ నిర్ధారణ అయ్యాక శ్వాసకోశ సమస్యలు తలెత్తాయి. ఛాతిలో నొప్పి, ఆయాసంతో ఇబ్బందిపడ్డాను. నా ఆరోగ్య సమస్యల గురించి చెబితే వారు పారాసిటమాల్ ఇచ్చారు తప్ప పెద్దగా పట్టించుకోలేదు . యూకేలో ట్రీట్మెంట్ గొప్పగా ఉంటుందని అనుకుంటాం. కాని ఇది నాకు చాలా చేదు అనుభవం. ఇండియాలో ఎమర్జెన్సీ అంటే వెంటనే అడ్మిన్ చేసుకొని వైద్యం అందిస్తారు. ఇక్కడ అలా లేదు. ఇండియాలోనే కరోనాకు మంచి వైద్యం అందిస్తున్నారు. మీ అందరి ప్రార్థనల వల్ల ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. త్వరలోనే ఇండియాకు వస్తాను అంటూ నీలిమ ఓ వీడియో విడుదల చేసింది.