సంతోష్‌శోభన్, కావ్యథాపర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఏక్ మినీ కథ’. కార్తిక్ రాపోలు దర్శకుడు. యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ నెల 30న ఈ చిత్రం విడుదలకానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘వినోదాత్మక ప్రేమకథా చిత్రమిది. సంతోష్ అనే సివిల్ ఇంజినీర్ యువకుడికి ఎదురయ్యే సమస్యలు నవ్విస్తాయి. దర్శకుడు మేర్లపాక గాంధీ అందించిన కథ ఆకట్టుకుంటుంది. ఇటీవల విడుదలైన టీజర్, పోస్టర్స్‌కు చక్కటి స్పందన లభిస్తోంది’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు.