సంపత్‌కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘సురాపానం’. ‘కిక్ అండ్ ఫన్’ ఉపశీర్షిక. మధు నిర్మాత. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను దర్శకుడు వేణు ఊడుగుల శుక్రవారం విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో దర్శకనిర్మాతలు చేసిన ఈ ప్రయత్నం విజయవంతం కావాలి. ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఉన్నతమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకాదరణను చూరగొంటుందనే నమ్మకముంది’ అని తెలిపారు. నవ్విస్తూనే థ్రిల్‌ను పంచే చిత్రమిదని నిర్మాత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంపత్‌కుమార్, రాజుయాదవ్, శ్రీనివాస్‌రాయ్, విజయ్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు. అజయ్‌ఘోష్, ఫిష్వెంకట్, సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సెసిరోలియో.