అభినయపరంగా ఎలాంటి పాత్రకైనా సిద్ధమేనని, అయితే వినోదాన్ని పండించడం ఆషామాషీ విషయం కాదని చెప్పింది మంగళూరు సుందరి పూజాహెగ్డే. ప్రస్తుతం ఈ సుందరి తెలుగులో ‘రాధేశ్యామ్’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది. అక్కినేని అఖిల్‌తో కలిసి నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రంలో ఈ భామ ఓ ఎపిసోడ్లో స్టాండప్ కమెడియన్ పాత్రలో కనిపించనుందట. తన పాత్ర గురించి పూజాహెగ్డే మాట్లాడుతూ ‘స్టాండప్ కమెడియన్‌గా మెప్పించాలంటే ఎంతో సాధన అవసరం. చక్కటి పంచ్‌లు, వ్యంగ్యం కలబోతగా సమయస్ఫూర్తితో వినోదాన్ని పండించాలి. స్వాభావికంగా మంచి హాస్యచతురత ఉంటేనే అది సాధ్యమవుతుంది. అందుకే ఈ పాత్ర కోసం ఎంతగానో సాధన చేశాను’అని చెప్పింది.