బుధవారం 03 మార్చి 2021
Cinema - Jan 19, 2021 , 19:03:59

కామెడీ ఎంటర్‌టైనర్ గా ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్

కామెడీ ఎంటర్‌టైనర్ గా ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్

ఇప్పట్నుంచి కామెడీ సినిమాలు చేయను..ఇకపై నేను చేసేవన్నీ సీరియస్ సినిమాలే..నన్ను నేను మార్చుకునే క్రమంలో ఇదే నాందీ అంటూ ఆ మధ్య చెప్పాడు అల్లరి నరేష్..అన్నట్లుగానే ఈయన నుంచి ‘నాంది’  అనే సీరియస్ సబ్జెక్ట్ వస్తుంది. అయితే దానికంటే ముందే బంగారు బల్లోడు అంటూ మరో సినిమా చేసాడు నరేష్. ప్యాండమిక్ కారణంగా సినిమా విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైందిప్పుడు. జనవరి 23న సినిమా విడుదల కానుండటంతో ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. తెలుగులో‘నటకిరిటీ’ రాజేంద్రప్రసాద్ తర్వాత అంతటి కామెడీ హీరోగా ఇమేజ్ సంపాదించుకున్నాడు నరేష్. 


ఈ మధ్యే ‘మహర్షి’, ‘నాంది’ లాంటి సినిమాలతో తనను తాను మార్చుకుంటున్నాడు న‌రేశ్‌. కానీ తన మార్క్ కామెడీ మాత్రం మిస్ కాకుండా ఇప్పుడు బంగారు బుల్లోడుగా వస్తున్నాడు. పూజా ఝవేరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పివి గిరి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నాడు. బాలయ్య బ్లాక్ బస్టర్ టైటిల్ తోపాటు ‘బంగారు బుల్లోడు’లోని చార్ట్ బస్టర్ సాంగ్ ‘స్వాతిలో ముత్యమంత’ కూడా ఇందులో రీమిక్స్ చేసారు. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ వచ్చేస్తుంది. బంగారు కుదువ పెట్టుకుని రుణాలు ఇచ్చే బ్యాంక్ ఉద్యోగి పాత్రలో నరేష్ నటిస్తున్నాడు. అలాంటిది అనుకోకుండా కొన్ని లక్షల విలువ చేసే బంగారం దొంగిలించబడుతుంది. 

ఆ తర్వాత ఏం జరుగుతుంది..? ఎవరు బంగారం కొట్టేసారు అనేది మిగిలిన కథ. నరేష్ మరోసారి తన మార్క్ కామెడీతో ఆకట్టుకోబోతున్నాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాకు సతీష్ ముత్యాల డిఓపి. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో పోసాని, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, పృథ్వీ, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్, రజిత తదితరులు నటించారు. మరి ఈ సినిమాతో నరేష్ ఏం మాయ చేయబోతున్నాడో చూడాలి.

ఇవి కూడా చ‌ద‌వండి..

RRR క్లైమాక్స్ మొద‌లైంది..రాజ‌మౌళి ట్వీట్ వైర‌ల్‌

ర‌కుల్ జిమ్ వ‌ర్క‌వుట్ వీడియో వైర‌ల్

టాలీవుడ్‌ మోస్ట్ వాంటెడ్ విల‌న్ ఇత‌డే..!

చిరంజీవి న‌న్ను చాలా మెచ్చుకున్నారు..

సంక్రాంతి హిట్‌పై క‌న్నేసిన సోనూసూద్‌..?

'క్రాక్' చూసి ఒంగోలు మెమొరీస్ గుర్తుచేసుకున్న చిరంజీవి

లైట్‌..కెమెరా..యాక్ష‌న్..'ఖిలాడి' సెట్స్ లో ర‌వితేజ‌

తెర‌పైకి నాగార్జున-పూరీ కాంబినేష‌న్‌..?

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo