మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 25, 2020 , 00:10:27

హాస్యనటుడు వేణుగోపాల్‌ కరోనాతో మృతి

హాస్యనటుడు వేణుగోపాల్‌ కరోనాతో మృతి

సీనియర్‌ హాస్యనటుడు కోసూరి వేణుగోపాల్‌ బుధవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస       విడిచారు.  రాయలసీమ యాస, విభిన్నమైన హావభావాలు, ఆహార్యంతో ఎన్నో సినిమాల్లో చక్కటి హాస్యాన్ని పండించారాయన.  పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జన్మించిన వేణుగోపాల్‌ ఎఫ్‌సీఐలో మేనేజర్‌గా పనిచేశారు.  పి.ఎన్‌.రామచంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘తెగింపు’ సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమాలో హోటల్‌ మేనేజర్‌గా  చిన్న పాత్రలో కనిపించారు. ‘మర్యాద రామన్న’ చిత్రం హాస్యనటుడిగా ఆయనకు చక్కటి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో బ్రహ్మాజీ తండ్రిగా ఆయన పాత్ర ఆద్యంతం నవ్వుల్ని పంచుతుంది.  రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమాలో ఆయన నటించారు. విక్రమార్కుడు, ఛలో, పిల్ల్ల జమీందార్‌, రాజా ది గ్రేట్‌, అమీతుమీ చిత్రాలు వేణుగోపాల్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి. 


logo