బుధవారం 30 సెప్టెంబర్ 2020
Cinema - Sep 16, 2020 , 00:09:52

కలర్‌ఫొటో కహానీ

కలర్‌ఫొటో కహానీ

సుహాస్‌, చాందిని చౌదరి జంటగా నటిస్తోన్న చిత్రం ‘కలర్‌ఫొటో’. సందీప్‌రాజ్‌ దర్శకుడు. సాయిరాజేష్‌నీలం, బెన్నీ ముప్పానేని నిర్మాతలు. సునీల్‌ కీలక పాత్రధారి. విజయదశమి సందర్భంగా అక్టోబర్‌ 23న ఆహా ఓటీటీ  ద్వారా ఈ చిత్రం విడుదలకానుంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘శరీర ఛాయ ఆధారంగా కనబరిచే వివక్ష నేపథ్యంలో తెరకెక్కిన వినోదభరిత ప్రేమకథా చిత్రమిది. నలుపు రంగు అబ్బాయికి, అందమైన అమ్మాయికి మధ్య జనించిన ప్రేమ ఎలా విజయతీరాలకు చేరుకున్నదనేది ఆకట్టుకుంటుంది. వినోదం, ప్రేమ అంశాల కలబోతగా రియల్‌లైఫ్‌ ఎమోషన్స్‌తో ఆద్యంతం ఆసక్తిని పంచుతుంది. ఇటీవల విడుదలైన టీజర్‌తో పాటు ‘తరగతి గదిలో’ పాటకు చక్కటి స్పందన లభిస్తోంది. ప్రతినాయకుడిగా సునీల్‌ పాత్ర అలరిస్తుంది’ అని తెలిపారు.  ఈ చిత్రానికి కథ: సాయిరాజేష్‌నీలం, సంగీతం: కాలభైరవ. 


logo