గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 08, 2020 , 12:19:34

జయప్రకాశ్ రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

జయప్రకాశ్ రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

హైదరాబాద్‌:  ప్రముఖ సినీ నటుడు  జయప్రకాశ్ రెడ్డి(74) మరణం పట్ల ముఖ్యమంత్రి   కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనేక సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించిన మంచి నటుడిగానే కాకుండా, గొప్ప రంగస్థల నటుడిగా కూడా జయప్రకాశ్ రెడ్డికి ప్రజల్లో  అభిమానం ఉందని సీఎం అన్నారు.

మంగళవారం తెల్లవారు జామున గుండెపోటుతో బాత్‌రూమ్‌లోనే కుప్పకూలిన జయప్రకాశ్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో సినిమా షూటింగ్‌లు లేకపోవడంతో ప్రస్తుతం ఆయన గుంటూరులో నివాసం ఉంటున్నారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.