బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 08, 2020 , 17:36:11

బ‌న్నీ ఆర‌వ వేలుపై వ‌చ్చిన క్లారిటీ..!

బ‌న్నీ ఆర‌వ వేలుపై వ‌చ్చిన క్లారిటీ..!

గంగోత్రి చిత్రంతో త‌న సినీ ప్ర‌యాణం మొద‌లు పెట్టిన అల్లు అర్జున్ ఈ రోజు వ‌ర‌కు 20 సినిమాలు చేశారు. ఎంద‌రో ప్రేక్ష‌కుల‌ని సంపాదించుకున్నారు. అత‌ని స్టైల్‌ని , డ్యాన్స్‌ని అనుక‌రించేందుకు చాలా మంది ప్ర‌య‌త్నం చేస్తుంటారు. అయితే ఇన్నాళ్లు బ‌న్నీకి సంబంధించి ఓ విష‌యాన్ని గ‌మ‌నించ‌లేక‌పోయిన ఫ్యాన్స్‌, నేటితో క్లారిటీకి వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది.

బ‌న్నీ త‌న 20వ చిత్రంగా పుష్ప అనే మూవీ చేస్తుండ‌గా, ఈ చిత్రానికి సంబంధించి రెండు పోస్ట‌ర్స్ విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. రెండో పోస్టర్స్ జ‌నాల‌లో ఎక్క‌డ లేని అనుమానాల‌ని క‌లిగించింది. రెండవ పోస్టర్ లో అల్లు అర్జున్ కాలికి  ఆరవ వేలు ఉంద‌ని, ఇది సుకుమార్ క‌థ కోసం సృష్టించాడా లేక బ‌న్నీకి ఆర‌వ వేలు ఉందా అనే చ‌ర్చ సోష‌ల్ మీడియాలో హాట్ హాట్‌గా న‌డుస్తూ వ‌స్తుంది.

బ‌న్నీ స‌న్నిహిత వ‌ర్గాల ద్వారా తెలిసిన విష‌యం ఏమంటే ఆయ‌న‌కి నిజంగానే ఆర‌వ వేలు ఉంద‌ట‌. సాధార‌ణంగా చేతికి లేదా కాలుకి ఆర‌వ వేలు ఉంటే అదృష్టంగా భావిస్తారు. ఆర‌వ వేలు ఉన్న‌ బన్నీ ఎంత అదృష్టవంతుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కు ఆరవ వేలు ఉంటుంది. ఆయ‌న కూడా సూప‌ర్ స్టార్‌గా బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలుగున్న విష‌యం తెలిసిందే. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo