గురువారం 04 జూన్ 2020
Cinema - Mar 15, 2020 , 10:39:23

అనుష్క త‌దుప‌రి సినిమాపై క్లారిటీ..!

అనుష్క త‌దుప‌రి సినిమాపై క్లారిటీ..!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి భాగ‌మ‌తి చిత్రం త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల నిశ్శ‌బ్ధం చిత్ర షూటింగ్ పూర్తి చేసింది. ఏప్రిల్ 2న ఈ చిత్రం విడుద‌ల కానుంది. అనుష్క త‌దుప‌రి సినిమాల‌కి సంబంధించి తాజాగా ఓ వార్త వైర‌ల్‌గా మారింది. గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్న అనుష్క‌, మ‌రో రెండు సినిమాల‌కి సంబంధించి చ‌ర్చ‌లు జ‌రుపుతుంద‌ట‌. అనుష్క నటించిన తాజా చిత్రం నిశ్శ‌బ్ధం హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా, టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, హేమంత్ మ‌ధుక‌ర్ నిర్మిస్తున్నారు. క‌రోనా కార‌ణంగా చిత్రం వాయిదా ప‌డుతుందా, లేదంటే అనుకున్న స‌మ‌యానికే రిలీజ్ అవుతుందా అనే దానిపై సందిగ్ధ‌త నెల‌కొంది. 


logo