ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 16, 2020 , 11:03:38

డ్ర‌గ్స్ కేసు: వివేక్ ఒబేరాయ్ భార్య‌కు నోటీసులు

డ్ర‌గ్స్ కేసు: వివేక్ ఒబేరాయ్ భార్య‌కు నోటీసులు

శాండ‌ల్‌వుడ్‌లో డ్ర‌గ్స్ కుంభ‌కోణం ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుంది. ఇప్ప‌టికే ఈ కేసులో  హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ సహా పలువురు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు బెంగ‌ళూరు పోలీసులు. అయితే  నిందితులు ఇచ్చిన‌ స‌మాచారం ప్ర‌కారం  వివేక్ ఒబేరాయ్ బావమరిది ఆదిత్య ఆళ్వా డ్ర‌గ్స్ కేసులో నిందితుడిగా ఉన్నట్టు గుర్తించారు. ప్ర‌స్తుతం అత‌డు పరారీలో ఉండటంతో పోలీసులు గాలింపులో భాగంగా గురువారం ముంబయిలోని వివేక్ ఒబెరాయ్ నివాసంలో సోదాలు చేశారు.  ఆదిత్యను పట్టుకునే చర్యల్లో భాగంగా కోర్టు వారెంట్‌తో అతడి బంధువైన వివేక్ ఒబెరాయ్ ఇంట్లో సోదాలు చేసినట్లు కమిషనర్ తెలిపారు.

బెంగళూరులోని కాటన్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్లో ఆదిత్యపై కేసు నమోదు కాగా అతడిని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని  పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ తెలిపారు. అయితే తాజాగా డ్ర‌గ్స్ కేసుకు సంబంధించి బెంగ‌ళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రియాంక అళ్వా  ఒబేరాయ్‌కు నోటీసులు పంపారు. సోదరుడు ఆదిత్య అల్వాతో శాండల్‌వుడ్ డ్రగ్ కేసుకు సంబంధించి ప్రియాంక‌కు కూడా సంబంధాలు ఉన్న‌ట్టు గుర్తించిన పోలీసులు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తుంది. ఆదిత్య అళ్వా .. మాజీ మంత్రి జీవరాజ్‌ ఆళ్వా కుమారుడు అన్న విష‌యం తెలిసిందే. 


logo