సోమవారం 03 ఆగస్టు 2020
Cinema - Jul 13, 2020 , 07:05:34

సినీనటి దివ్య చౌక్సే క్యాన్సరుతో కన్నుమూత

సినీనటి దివ్య చౌక్సే క్యాన్సరుతో కన్నుమూత

ముంబై : బాలీవుడ్ నటి, మోడల్‌ దివ్య చౌక్సే క్యాన్సర్‌తో కన్నుమూశారు. ‘హై అప్పా దిల్ తోహ్ అవారా’ చిత్రంలో నటించిన దివ్య చౌక్సే సుదీర్ఘకాలం క్యాన్సర్‌తో పోరాడారు. దివ్య చౌక్సే మృతిని ఆమె బంధువు సౌమ్యా అమిష్‌వర్మ సంతాపం తెలిపి ధ్రువీకరించారు. దివ్య మృతికి సినీనటుడు సాహిల్ ఆనంద్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సంతాపం తెలిపారు. ‘‘మీ అభిరుచి, కల, సినీపరిశ్రమపై మీ సానుకూలత, మీ అన్నయ్యనైన నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. మీ ఆత్మకు శాంతి చేకూరుగాక, మీ జ్ఞాపకాలు నా హృదయంలో సజీవంగా ఉంటాయి’’ అని సాహిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. 

దివ్య చౌక్సే మరణానికి కొన్ని గంటల ముందు తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ కోసం హృదయ విదారక పోస్టు పెట్టారు. ‘‘కేన్సరుతో నేను నెలల తరబడిగా మంచం మీద ఉన్నాను... దివ్య చౌక్సే బై ’’ అంటూ పోస్టు చేశారు. దివ్య చౌక్సే పలు యాడ్ ఫిల్మ్స్, టెలివిజన్ షోలలో నటించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo