ది ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ రాజ్-డీకే తెరకెక్కించిన ప్రాజెక్టు సినిమా బండి. ప్రవీణ్ కండ్రిగుల అనే కొత్త దర్శకుడు ఈసినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కా బోతున్నాడు.. ఇటీవలే ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా బండి ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ లో ఆటోరిక్షా లో ఓ వ్యక్తి కెమెరా పట్టుకుని కనిపిస్తుండగా.. ఆటోడ్రైవర్ స్నేహితులను తన గ్రామంలోకి తీసుకెళ్తున్నాడు.
అయితే ఆ కెమెరాను ఎలా ఉపయోగించాలో తెలియని సినిమా బండి బ్యాచ్ .మొత్తానికి అదే కెమెరాతో ఓ సినిమా ఎలా తీశారో చూపిస్తూ.. న్యాచురల్, ఫన్నీగా సాగుతున్న ట్రైలర్ మిలియన్ కు పైగా వ్యూస్ తో ఇంప్రెసివ్ ఫీట్‌ను చేరుకుంది..సినిమా బండి మే 14న నెట్‌ఫ్లిక్స్ లో విడుదల కానుంది.