ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 11, 2020 , 13:24:17

ఒకే ఫ్రేములో షారుక్‌, జాకీచాన్‌, ‘ఆక్వామ్యాన్' జాసన్‌

ఒకే ఫ్రేములో షారుక్‌, జాకీచాన్‌, ‘ఆక్వామ్యాన్' జాసన్‌

షారుక్‌ఖాన్‌, జాకీచాన్‌, జాసన్‌ మమోవా. ఈ ముగ్గురిలో ఉన్న కామన్‌  పాయింట్  స్టార్‌ సెలబ్రిటీలు. ప్రపంచవ్యాప్తంగా ఈ ముగ్గురికి  ఎంతమంది అభిమానులు ఉన్నారంటే చెప్పడం కష్టమే. మరి ఈ ముగ్గురూ ఒకే ఫ్రేములో ఉంటే ఎలా ఉంటుంది. అవును ప్రస్తుతం ఈ  ఫొటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. గతేడాది షారుక్‌ఖాన్‌ రియాద్‌ (దుబాయ్‌)లో జాయ్‌ ఫోరమ్‌-19 మీట్‌లో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో షారుక్‌తోపాటు హాలీవుడ్‌ స్టార్లు జాకీచాన్‌, జాసన్‌ మమోవా (ఆక్వామ్యాన్ స్టార్‌)పాల్గొన్నారు. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమానికి తనను ఆహ్వానించి..హాలీవుడ్‌ స్టార్‌ జాకీచాన్‌ను కలిసే అవకాశం వచ్చినందుకు ఆనందంలో మునిగిపోయాడు షారుక్‌. అంతేకాదు తన కుమారుడు అబ్‌రామ్‌ ఆక్వామ్యాన్ స్టార్  జాసన్‌కు వీరాభిమాని అని చెప్పుకొచ్చాడు.

మార్షల్‌ ఆర్ట్స్‌ నిపుణుడు, బెల్జియన్‌ హీరో జీన్‌ క్లౌడ్‌ వాన్‌ డమ్మే కూడా ఈవెంట్‌లో పాల్గొన్నాడు. జీన్‌క్లౌడ్‌, జాకీచాన్‌తో షారుక్‌ సెల్ఫీ కూడా దిగాడు. త్రోబ్యాక్‌ సెల్ఫీని షారుక్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌చేశాడు. స్టార్‌ హీరోలంతా ఒక్కచోట చేరి సందడి చేసిన త్రోబ్యాక్‌ ఫొటోలను అభిమానులు తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo