సోమవారం 19 అక్టోబర్ 2020
Cinema - Sep 29, 2020 , 17:59:23

ఎస్పీ బాలుకు సినీ మ్యూజిషియన్స్ యూనియన్ నివాళి !

ఎస్పీ బాలుకు సినీ మ్యూజిషియన్స్ యూనియన్ నివాళి !

భువి నుంచి దివికేగిన గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకి సినీ మ్యూజిషియన్స్ యూనియన్  ఘ‌నంగా నివాళులర్పించింది. సంఘం గౌరవాధ్యక్షులు ఆర్.పి.పట్నాయక్, అధ్యక్షురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, రఘు కుంచె, సురేఖామూర్తి, అనూప్ రూబెన్స్, రవివర్మ, శ్రీకాంత్, వేణు, మణి- నాగరాజ్, బల్లేపల్లి మోహన్, రవిశంకర్, ఎం.వి.కె.మల్లిక్, శివరామ్ వింజమూరి, కె.ఎం.రాధాకృష్ణ,- ఎస్.ఏ.ఖుద్ధూస్, వెంగీ సుధాకర్, మాధవి తదితరులు బాలు గొప్పతనాన్ని, ఆయనతో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఈ కార్య‌క్రమానికి ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయిన పలువురు ప్రముఖులు జూమ్ యాప్ ద్వారా తమ సంతాపాన్ని ప్రకటించారు. వారిలో కె.రాఘవేంద్రరావు, మాధవపెద్ది సురేష్, మనో, రామాచారి, కోటి, ఎం.ఎం.శ్రీలేఖ, శ్రీరామచంద్ర, వినోద్ బాబు, పార్థసారథి, శారదాసాయి, వి.కనకదుర్గ,  శ్రీకృష్ణ, కౌసల్య, నూతన, సందీప్, శశికళ, ప్రవీణ్ తదితరులున్నారు. 



లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo