గురువారం 28 జనవరి 2021
Cinema - Dec 03, 2020 , 12:06:12

తిరిగి ప్రారంభ‌మైన కోబ్రా చిత్ర షూటింగ్‌..!

తిరిగి ప్రారంభ‌మైన కోబ్రా చిత్ర షూటింగ్‌..!

విలక్షణ నటుడు విక్రమ్  ప్ర‌స్తుతం ‘కోబ్రా’ అనే చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంతో ఇండియ‌న్ మాజీ క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ తెరంగేట్రం చేస్తున్నాడు. ఈ చిత్రం 25 శాతం షూటింగ్ పూర్తి చేసుకాగా, క‌రోనా వ‌ల‌న తాత్కాలిక బ్రేక్ ప‌డింది. దాదాపు తొమ్మిది నెల‌ల త‌ర్వాత చిత్ర షూటింగ్ ప్రారంభించారు. వీలైనంత త్వ‌ర‌గా షూటింగ్ పూర్తి చేసి వ‌చ్చే ఏడాది చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తేవాల‌ని మేక‌ర్స్ భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. 

తన బాడీని ప్రయోగశాలగా మార్చి ప్రతి పాత్రలో వైవిధ్యం కనబరుస్తున్న‌ విక్రమ్ తాజా చిత్రంలో ఏడు అవతారాలలలో కనిపిస్తున్నారు. శాస్త్రవేత్త, ప్రొఫెసర్‌, రాజకీయనాయకుడు, మత భోదకుడు.. ఇలా పలు పాత్రలలో కనిపించి మెప్పించనున్నాడు. ఇర్ఫాన్  ఇంట‌ర్‌పోల్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నాడు.  అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న‌ ‘కోబ్రా’ చిత్రం కి ఏఆర్‌ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.   విక్రమ్ సరసన ‘కేజీఎఫ్’ భామ శ్రీనిధి శెట్టి కథానాయిక గా న‌టిస్తుంది.


logo