ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 01, 2020 , 03:09:39

చిత్రపటం కథ!

చిత్రపటం కథ!

పార్వతీశం (నూకరాజు), శ్రీవల్లి జంటగా బండారు దానయ్య కవి దర్శకత్వంలో పుప్పాల శ్రీధర్‌ నిర్మిసున్న చిత్రం ‘చిత్రపటం’. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం విశేషాలను దర్శకుడు తెలియజేస్తూ ‘విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే యూత్‌ అండ్‌ ఫ్యామిలీ కథ ఇది. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తున్నాం. నేటి యువతకు నచ్చే అంశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా చిత్రాన్ని రూపొందిస్తున్నాం’అన్నారు. పాటల రచయితగా అందరికి సుపరిచితులైన బండారు దానయ్య కవి దర్శకుడిగా ఎంతో క్లారిటీతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడని, టాకీపార్ట్‌ పూర్తయిందని నిర్మాత తెలిపారు.   ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్‌.మురళీమోహన్‌ రెడ్డి. logo