శనివారం 11 జూలై 2020
Cinema - May 03, 2020 , 19:08:41

అలనాటి హీరోయిన్లతో చిరు స్టెప్పులు - వీడియో

అలనాటి హీరోయిన్లతో చిరు స్టెప్పులు - వీడియో

మెగాస్టార్ చిరంజీవి స్టెప్పులేస్తే అభిమానుల‌లో పూన‌కాలు రావ‌ల‌సిందే. అలా త‌న డ్యాన్స్‌తో ఎంతో మంది ప్రేక్ష‌కుల‌ని ఏర్ప‌ర‌చుకున్నారు చిరు. తాజాగా 80ల కాలం నాటి స్టార్స్‌తో డ్యాన్స్ చేసిన వీడియో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇచ్చారు. టాలీవుడ్‌లో 80ల నాటి తారలందరు ప్ర‌తి ఏడాది రీయూనియన్ ఫాం చేస్తూ `క్లాస్ ఆఫ్ ఎయిటీస్` పేరుతో సంద‌డి చేస్తుంటారు. గ‌త ఏడాది `క్లాస్ ఆఫ్ ఎయిటీస్`  పదో వార్షికోత్సవ పార్టీని హైదరాబాద్ లోని మెగాస్టార్  చిరంజీవి స్వగృహం లో నిర్వ‌హించారు. వీటికి సంబంధించిన కొన్ని క్లిప్స్ బ‌య‌ట‌కి రాగా, వాటిని చూసి మురిసిపోయారు ఫ్యాన్స్.

80ల కాలం నాటి స్టార్స్ రీయూనియ‌న్‌కి సంబంధించి వీడియో షేర్ చేస్తాన‌ని ఇటీవ‌ల ప్ర‌క‌టించారు చిరు. కాని ఇర్ఫాన్ మృతి కార‌ణంగా వాయిదా వేశారు. తాజాగా వీడియో షేర్ చేస్తూ.. ఫ్రెండ్స్‌ని క‌ల‌వ‌డం ఒక స‌ర‌దా, డ్యాన్స్ చేయ‌డం ఓ స‌ర‌దా అంటూ జ‌య‌ప్ర‌ద‌, జ‌య‌ల‌లిత‌, సుహాసిని వంటి స్టార్స్‌తో డ్యాన్స్‌ల‌కి సంబంధించిన వీడియో షేర్ చేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్ ..బాసు చూపించారు మీ గ్రేసు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ పార్టీకి చిరంజీవి, మోహన్ లాల్, వెంకటేశ్, మోహన్ బాబు సుహాసిని, ఖుష్బూ ,రాధిక, సుమలత ,నరేశ్, అర్జున్, జాకీ ష్రాఫ్ , ప్రభు, శోభన, భాగ్యరాజ్, శరత్ కుమార్స,స‌త్యరాజ్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.


logo