e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News న‌ర్సుల దినోత్స‌వం.. మెగాస్టార్ ట్వీట్ వైర‌ల్

న‌ర్సుల దినోత్స‌వం.. మెగాస్టార్ ట్వీట్ వైర‌ల్

న‌ర్సుల దినోత్స‌వం.. మెగాస్టార్ ట్వీట్ వైర‌ల్

నర్సు వృత్తికి మార్గదర్శకంగా ఉన్న ఫ్లోరెన్స్ నైటింగేల్ 1854 లో క్రిమియా యుద్ధంలో టర్కీ లో గాయపడిన సైనికులకు చేసింది. ఆమె చేసిన సేవకు గుర్తుగా ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినమైన మే 12 ను పురస్కరించుకుని అంతర్జాతీయ నర్సుల దినోత్సవం గా జరుపుతున్నారన్నారు. నిస్వార్ధంగా సేవ చేస్తూ ప్ర‌తి వారిని తమ సొంతవారిలా చూసే న‌ర్సులకు అంత‌ర్జాతీయ న‌ర్సుల దినోత్సవం సంద‌ర్బంగా సెల్యూట్ చేశారు.

దేశం, ప్ర‌పంచంలోని న‌ర్సులంద‌రికి సెల్యూట్ చేస్తున్నాను. మీరు నిజ‌మైన కోవిడ్ హీరోస్, అంతేకాదు ఆరోగ్య సంర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లో ముఖ్య భాగం కూడా. మీరు అల‌సిపోకుండా సేవ‌లు చేస్తూ ప్ర‌జ‌లంద‌రి ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు.మీకు దేవుడు మ‌రింత శ‌క్తిని అందించాల‌ని కోరుకుంటున్నాను. కరోనా వేళ తమ ప్రాణాలను పణంగా పెట్టి చేస్తున్న సేవ‌లు ఎంతో గొప్ప‌వ‌ని చిరంజీవి త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
న‌ర్సుల దినోత్స‌వం.. మెగాస్టార్ ట్వీట్ వైర‌ల్

ట్రెండింగ్‌

Advertisement