సోమవారం 26 అక్టోబర్ 2020
Cinema - Sep 07, 2020 , 11:58:54

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్‌కు మెగాస్టార్ బ‌ర్త్‌డే విషెస్

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్‌కు మెగాస్టార్ బ‌ర్త్‌డే విషెస్

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి ఈ రోజు 69వ బ‌ర్త్‌డే జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌ల వెల్లువ కురుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి, మ‌ల‌యాళ మెగాస్టార్ మోహ‌న్ లాల్, పృథ్వీరాజ్, మ‌హేష్ బాబు త‌దిత‌రులు మ‌మ్ముట్టికు త‌మ సోష‌ల్ మీడియా ద్వారా జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. 

చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ ద్వారా.. జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు ప్రియ‌త‌మ మ‌మ్ముట్టి. అద్భుత‌మైన ప‌రిశ్ర‌మ‌లో మీ స‌హోద్యోగిగా ఉన్నందుకు గ‌ర్వంగా ఉంది.  గ‌త కొద్ది సంవ‌త్స‌రాలుగా సినీ ప్రేమికులని అల‌రిస్తున్న మీరు , మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు. చాలా సంవ‌త్స‌రాల పాటు ప్రేక్ష‌కుల‌ని మంత్ర‌ముగ్ధుల‌ని చేస్తూ ఉండండి అని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు చిరు. అలానే మ‌మ్ముట్టి కి విషెస్ తెలిపిన మోహ‌న్ లాల్ .. దేవుడు  మీకు ఆయురారోగ్యాలు అందించాల‌ని కోరుకుంటున్నాన‌ని త‌న ట్వీట్‌లో తెలియ‌జేశారు. 


logo