నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణ ఈ రోజు 78వ బర్త్డే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఇండస్ట్రీ నుండి, కుటంబ సభ్యుల నుండి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు అందుతున్నాయి. మహేష్ బాబు తన తండ్రికి ట్విట్టర్ ద్వారా విషెస్ తెలియజేస్తూ..’హ్యాపీ బర్త్ డే నాన్న, నేను ముందుకెళ్లడానికి నాకు అత్యుత్తమైన మార్గాన్ని చూపించినందుకు ధన్యవాదాలు. మీరు ఊహించనంతగా మిమ్మల్ని ప్రేమిస్తుంటాను అని అన్నారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా కృష్ణకి శుభాకాంక్షలు తెలియజేశారు. “సాహసానికి మారుపేరు,మల్లెపువ్వు లాంటి మనిషి సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు.సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వారు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. హ్యాపీ బర్త్ డే సార్” అంటూ తన గౌరవాన్ని చిరు వ్యక్తపరిచారు.