ఆదివారం 31 మే 2020
Cinema - May 01, 2020 , 11:28:18

వ‌ల‌స కార్మికుల గురించి ఆలోచించండి: చిరంజీవి

వ‌ల‌స కార్మికుల గురించి ఆలోచించండి:  చిరంజీవి

అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని కార్మికులు ప్రతి ఏడాది మే 1న ఘనంగా జరుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. కాని ఈ ఏడాది కరోనా సంక్షోభం వ‌ల‌న వారు విప‌త్క‌ర ప‌రిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్ర‌భుత్వాలు వారిని ఆదుకునే ప్ర‌యత్నం చేస్తున్న‌ప్ప‌టికీ, కొంద‌రు ఇబ్బందుల ప‌డుతూనే ఉన్నారు. మేడే సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఈ రోజు మేడే. ప్రపంచాన్ని నిర్మించినది కార్మికులు. ఈ ప్రపంచ కార్మిక దినోత్సవం రోజున‌ అసాధారణ పరిస్థితిని ఎదుర్కొంటున్న మన దేశవ్యాప్తంగా ఉన్న వలస కార్మికులందరి గురించి ఆలోచించండి అని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు చిరంజీవి. ఇక డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ‌..మేడే సంద‌ర్భంగా  పోలీస్ డిపార్ట్మెంట్ మరియు వైద్యుల కృషికి  వందనం చేస్తున్న‌ట్టు ట్వీట్ చేసింది. మా రోజువారీ జీవితాలను సులభతరం చేస్తున్న ఇతర ముఖ్యమైన సేవల్లోని కార్మికులను కూడా మేము అభినందించాలనుకుంటున్నాము!ఈ మహమ్మారికి అతి త్వరలో స్వ‌స్తి ప‌లుకుతామ‌ని ఆశిస్తున్నాము అని పేర్కొన్నారు.


logo