గురువారం 28 మే 2020
Cinema - Apr 29, 2020 , 15:12:43

ఇర్ఫాన్ ఎప్ప‌టికీ మ‌న హృద‌యాల్లో చిర‌స్థాయిగా ఉంటారు: చిరంజీవి

ఇర్ఫాన్ ఎప్ప‌టికీ మ‌న హృద‌యాల్లో చిర‌స్థాయిగా ఉంటారు:  చిరంజీవి

విల‌క్ష‌ణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతిపై మెగాస్టార్ చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. ఇర్ఫాన్ ఖాన్ క‌న్నుమూసార‌నే భ‌యంక‌ర‌మైన వార్త విన‌డానికి చాలా బాధ‌గా ఉంది. ప్ర‌పంచ గుర్తింపు పొందిన అద్భుత‌మైన న‌టుడు. ఆయ‌న స్థానాన్ని ఎప్ప‌టికీ భ‌ర్తీ చేయ‌లేము. అత‌ని న‌ట‌న‌, ప్ర‌వ‌ర్త‌న మ‌న హృద‌యాల‌లో చిర‌స్థాయిగా నిలిచి ఉంటుంది. ఇమ్రాన్‌.. మిమ్మ‌ల్ని చాలా మిస్ అవుతున్నాం. మీరు ఎప్ప‌టికీ గుర్తుండిపోతారు అని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు చిరంజీవి

ఇక టాలీవుడ్ కి సంబంధించి ఆది, మెహ‌ర్ రమేష్‌, సుశాంత్, దేవ్ క‌ట్టా, మంచు మ‌నోజ్‌, విష్ణు, రాశి త‌దిత‌రులు ఇమ్రాన్ మృతికి సంతాపాన్ని తెలిపారు. ఇర్ఫాన్ మ‌ర‌ణ వార్త కేవ‌లం సినీ ప‌రిశ్ర‌మ‌కే కాక క్రీడా, రాజ‌కీయ రంగాల ప్ర‌ముఖుల‌ని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. క్రీడా ప్ర‌ముఖ‌ల‌లో స‌చిన్, విరాట్ కోహ్లీ, మ‌హ్మ‌ద్ కైఫ్ త‌దిత‌రులు ఆయ‌న లేర‌నే వార్త‌ని జీర్ణించుకోలేక‌పోతున్నారు.


logo