మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Oct 02, 2020 , 10:35:29

బాపు, శాస్త్రిల‌ను స్మ‌రించుకున్న చిరంజీవి

బాపు, శాస్త్రిల‌ను స్మ‌రించుకున్న చిరంజీవి

శాంతి, సమైక్యత కోసం పాటుప‌డ్డ మ‌హ‌నీయులు మ‌హత్మా గాంధీ, లాల్ బ‌హ‌దూర్ శాస్త్రిల జ‌యంతి నేడు. ఈ సంద‌ర్భంగా వారి గొప్ప‌తనాన్ని గుర్తు చేసుకుంటూ యావ‌త్ భార‌తావ‌ని ఘ‌న నివాళులు అర్పిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ ద్వారా మన జాతి నిర్మాతలను త‌ప్ప‌క‌ గుర్తుంచుకోవాలి అంటూ ట్వీట్ చేశారు. 

గాంధీ కేవ‌లం పేరు మాత్ర‌మే కాదు. అందరికి ఆద‌ర్శం, ఒక సిద్ధాంతం. ఆయ‌న పాటించిన స‌త్యం, శాంతి, అహింస సిద్ధాంతాలు ఈ ప్ర‌పంచానికి ఎంతో అవ‌స‌రం. 151వ జ‌యంతి సంద‌ర్భంగా జాతిపిత గాంధీని స్మ‌రించుకుందాం. ఆయ‌న‌ని అనుస‌రిద్ధాం. అలాగే  జై జ‌వాన్, జైకిసాన్ అనే  బ‌ల‌మైన నినాదంతో మ‌నల్ని ఉత్తేజ‌ప‌రిచిన లాల్ బ‌హుదూర్ శాస్త్రిగారి జ‌యంతి కూడా ఈరోజే. ఆయ‌న్ని ఎప్ప‌టికీ మ‌ర‌చిపోకూడ‌దు. సెల్యూట్ టు లాల్‌బ‌హుదూర్ శాస్త్రి అని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు మెగాస్టార్ చిరు.


logo