గురువారం 04 జూన్ 2020
Cinema - May 05, 2020 , 12:18:50

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి మెగాస్టార్ మ‌ద్ద‌తు

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి మెగాస్టార్ మ‌ద్ద‌తు

త‌న‌పై త‌ప్పుడు వార్త‌ల‌ని ప్ర‌చురించిన కొన్ని వెబ్‌సైట్స్‌పై విజ‌య్ ఘాటుగా స్పందించిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌కి మ‌ద్దతుగా టాలీవుడ్ స్టార్స్ అంద‌రు కిల్ ఫేక్ న్యూస్ అనే ఓ యాష్ ట్యాగ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..విజ‌య్‌కి మ‌ద్ద‌తు ప‌లికారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా విజయ్ స‌ర‌స‌న నిలిచారు.

డియర్ విజయ్ మీ ఆవేదన నేను అర్ధం చేసుకోగలను.బాధ్యతలేని రాతల వల్ల, మీలా నేను నా కుటుంబం బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటి త‌ప్పుల రాత‌ల‌ కారణంగా నువ్వు చేసే మంచి పనులు చేయడం ఆపవద్దని హిత‌వు ప‌లికారు మెగాస్టార్. ఇప్ప‌టికే  విజయ్ కు మద్దతుగా సూపర్ స్టార్ మహేష్ నిలవగా.. రవితేజ, కొరటాల శివ, రానా, అల్లరి నరేష్, మైత్రీ మూవీ మేకర్స్, అనిల్ రావిపూడి, క్రిష్ త‌దిత‌రులు నిలిచారు.


logo