గురువారం 03 డిసెంబర్ 2020
Cinema - Oct 23, 2020 , 13:19:43

ప్ర‌భాస్‌కు ప్ర‌త్యేక విషెస్ అందించిన చిరంజీవి

ప్ర‌భాస్‌కు ప్ర‌త్యేక విషెస్ అందించిన చిరంజీవి

బాహుబ‌లి సినిమాతో  తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంత‌రాలు దాటించిన ప్ర‌భాస్ ఈ రోజు 41వ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌కు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు శుభాకాంక్షలు తెలియ‌జేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి త‌న ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా ప్ర‌భాస్‌కు ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలిపారు. 

సైరా షూటింగ్ స‌మ‌యంలో ప్ర‌భాస్‌తో దిగిన  ఫోటోని షేర్ చేసిన చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియజేస్తూ.. డియ‌ర్ ప్ర‌భాస్ ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మ‌రెన్నో జ‌రుపుకోవాల‌ని కోరుకుంటున్నాను. ఈ ఏడాది నుండి అద్భుత‌మైన సినిమాల లైన‌ప్ బాగుండాల‌ని మ‌నస్పూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు చిరు. కాగా, సైరా న‌ర‌సింహారెడ్డి అనే పీరియాడిక‌ల్ చిత్రం చేయ‌డానికి ప్ర‌భాస్ న‌టించిన బాహుబ‌లి కార‌ణం అని చిరు ఓ సంద‌ర్భంలో చెప్పుకొచ్చిన విష‌యం తెలిసిందే.