మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Cinema - Aug 10, 2020 , 11:04:48

చిరు చేసిన 'చింత తొక్కుతో చేప‌ల ఏపుడు' చూశారా..!

చిరు చేసిన 'చింత తొక్కుతో చేప‌ల ఏపుడు' చూశారా..!

లాక్‌డౌన్ స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి త‌న పోస్ట్‌ల‌తో నెటిజ‌న్స్‌కి కావ‌ల‌సినంత వినోదాన్ని అందిస్తున్నారు. క‌రోనాపై అవ‌గాహ‌న క‌ల్పిస్తూనే ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ని షేర్ చేస్తున్నారు. ఆదివారం ఉద‌యం తాను ‘చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు…’ చేస్తానంటూ ఓ ట్వీట్ చేశారు. అన్న‌ట్టుగానే తాను చేసిన వంట‌కి సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 

సీ ఫుడ్‌ని ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే చిరంజీవి చేప‌ల వేపుడు బాగా ఇష్ట‌ప‌డ‌తార‌ట‌. త‌న అమ్మ చేసిన వంటైతే మ‌రీ ఇష్ట‌మ‌ట‌. సండే ఖాళీగా ఉన్నందున ‘అమ్మ కోసం అమ్మ నేర్పిన వంట’ అంటూ వంటలోని తన నైపుణ్యాన్ని చూపించారు ‘చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు…’ చేశానంటూ చిరు.. ఆ వంట తాలూకు వీడియోను సోషల్ మీడియాలో అభిమానుల కోసం పంచుకున్నారు. ఇందులో తాను ఆ వంట‌కం క్లియర్‌గా వివ‌రించారు. ప్ర‌స్తుతం ఆ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది. చిరు కోడ‌లు ఉపాస‌న మెగాస్టార్ వంటకి ఫిదా అయిన‌ట్టు కామెంట్ పెట్టింది. ఇదిలా ఉంటే మ‌రి కొద్ది రోజుల‌లో రానున్న చిరు బ‌ర్త్‌డేకి సంబంధించిన హంగామా ఇప్ప‌టికే మొద‌లు పెట్టిన సంగ‌తి తెలిసిందే.


View this post on Instagram

#SundaySavors

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) on


logo