సోమవారం 06 జూలై 2020
Cinema - May 08, 2020 , 09:43:11

అద్భుతాన్ని ప్లాన్ చేయ‌లేం, అలా జ‌రిగిపోతుంది : చిరంజీవి

అద్భుతాన్ని ప్లాన్ చేయ‌లేం, అలా జ‌రిగిపోతుంది :  చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి కెరియ‌ర్‌లోనే కాదు తెలుగ సినిమా చ‌రిత్ర‌లోను సువ‌ర్ణ అధ్యాయం లిఖించుకున్న చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి. రాఘవేంద్రరావు ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి, శ్రీదేవి ప్ర‌ధాన పాత్ర‌లుగా రూపొందిన ఈ చిత్రం మే 9, 2020తో 30 ఏళ్ళు పూర్తి చేసుకోబోతుంది. ఈ సంద‌ర్భంగా చిత్రానికి సంబంధించిన జ్ఞాప‌కాల‌ని షేర్ చేసుకుంటున్నారు మేక‌ర్స్‌. ఇటీవ‌ల చిత్రానికి సంబంధించిన‌ మొదటి స్టోరీని నాని వాయిస్ ఓవర్ తో వింటేజ్ వీడియోగా  వైజయంతి మూవీస్ వారు విడుదల చేసారు

తాజాగా జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్ర విష‌యాలని చిరు త‌న అభిమానుల‌తో షేర్ చేసుకున్నారు.  'అద్భుతాన్ని ఎవరూ ప్లాన్ చేసి సృష్టించ లేరు.. అవి అలా జరిగి పోతుంటాయి అంతే.. సెల్యులాయిడ్ పై అలాంటి అద్భుతం జరిగినట్లైతే అది శాశ్వత జ్ఞాపకాలని మరియు శాశ్వత ఆనందాన్ని మిగులుస్తుంది' అంటూ మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో రిలీజ్ చేసారు. ఇలాంటి సినిమాలు త‌రాలు మారిన ప్రేక్ష‌కుల గుండెల్లో చిర‌స్థాయిగా మిగులుతాయ‌ని ఈ సంద‌ర్భంగా తెలిపారు. 


logo