ఆదివారం 31 మే 2020
Cinema - May 09, 2020 , 12:35:43

జ‌గ‌దేకవీరుడు అతిలోకసుంద‌రి అనుభూతులు పంచుకున్న‌చిరు

జ‌గ‌దేకవీరుడు అతిలోకసుంద‌రి అనుభూతులు పంచుకున్న‌చిరు

స‌రిగ్గా మూడు ద‌శాబ్ధాల క్రితం విడుద‌లై వెండితెర‌పై సంచ‌ల‌నాలు సృష్టించిన చిత్రం ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’   చిరంజీవి, శ్రీదేవి జంటగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1990 మే 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది.  ఇంత‌టి అద్భుత‌మైన చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి ఎంద‌రో స‌మిష్టి కృషి ఉంది.  సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌ను మ్యాజికల్‌గా చూపించిన డీఓపీ విన్సెంట్‌, అందమైన సెట్స్‌తో మైమరపించేసిన ఆర్డ్‌ డైరెక్టర్‌ చలం, ఎడిటింగ్‌ స్కిల్‌తో సినిమాకు సూపర్‌ టెంపోనిచ్చిన  చంటి, పాటలు, మాటలతో మెస్మరైజ్‌ చేసిన వేటూరి, జంధ్యాల. వీళ్లందరి కష్టానికి  ప్రాణం పోసిన‌ లెజెండ్‌ ఇళయరాజా.

వైజ‌యంతి మూవీస్ బేన‌ర్‌పై విడుద‌లైన జ‌గ‌దేక వీరుడు అతిలోక‌సుంద‌రి చిత్రానికి సంబంధించి చెప్పుకోవాలంటే  ఎన్నో విష‌యాలు ఉన్నాయి. తిరుమ‌ల‌లో ఈ సినిమాకి శ్రీకారం చుట్ట‌గా, చిత్ర రిలీజ్ స‌మయంలో భీబ‌త్స‌మైన తుఫానుతో ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ప‌డ్డారు. ఆ స‌మ‌యంలోను చిత్రానికి ప్రేక్ష‌కులు పోటెత్త‌డం ఎప్ప‌టికి మ‌రిచిపోలేని విష‌య‌మ‌ని చిరంజీవి అన్నారు. తాజాగా వీడియో ద్వారా మ‌రిన్ని విష‌యాలు చిరు షేర్ చేసుకున్నారు. మీరు ఆ సంగ‌తులు విని ఆనందం పొందండి


logo