టెలివిజన్ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఒక కామెడీ షో ఏడేళ్లుగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ షో దూసుకుపోతుంది. దాని పేరు జబర్దస్త్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కామెడీ షో విజయం సాధించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో యాంకర్ రష్మి గౌతమ్ కూడా ఒక ప్రధాన కారణం. ఈమె కోసమే కామెడీ షో చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అదిరిపోయే హాట్ షో చేస్తూ మతులు చెడగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. జబర్దస్త్ మొదట్లో అనసూయ యాంకర్ గా ఉండేది. అయితే ఆమె కొన్ని వ్యక్తిగత కారణాల తో తప్పుకోవడంతో రష్మి గౌతమ్ వచ్చింది. వచ్చీ రావడంతోనే సెన్సేషనల్ హాట్ షో చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది ఈ భామ.
అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ షోను వదలలేదు. మధ్యలో ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా జబర్దస్త్ కు దూరంగా వెళ్ళలేదు. ఇతర చానల్స్ లో అద్భుతమైన అవకాశాలు వచ్చిన కూడా జబర్దస్త్ కామెడీ షో తనకు లైఫ్ ఇచ్చింది అనే ఒకే ఒక్క కారణంతో ఇక్కడే ఉండిపోయింది. అయితే ఇప్పుడు ఈమె కూడా మనసు మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈమె జబర్దస్త్ కు గుడ్ బై చెప్పాలని ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ కు వచ్చిన ఐదేళ్ళలో కేవలం మూడు సార్లు మాత్రమే ఈమెకు పారితోషికం పెంచారని..బయట మంచి అవకాశాలు వస్తుండడంతో అక్కడికి వెళ్లిపోవాలి అని రష్మీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ఇదే విషయం మల్లెమాల దగ్గర చర్చించి పారితోషికం పెంచితే ఇక్కడే ఉండాలా..?లేదా ? అనే నిర్ణయం రష్మి గౌతమ్ తీసుకుంటుంది. లేదంటే మాత్రం ఈమె జబర్దస్త్ కు దూరంగా వెళ్ళడం దాదాపు ఖాయం అయిపోయింది. ఇప్పటికే జెమిని, మా టీవీల్లో ఈమె రెండు కార్యక్రమాలకు యాంకర్ గా ఫిక్స్ అయిందని తెలుస్తుంది. అందుకే జబర్దస్త్ షో కు గుడ్ బై చెప్పాలని భావిస్తుంది. ఏదేమైనా రష్మి గౌతమ్ జబర్దస్త్ షో వదిలేస్తే మాత్రం అనసూయకు అది వరంగా మారనుంది.
ఇవి కూడా చదవండి
జేమ్స్ బాండ్ సినిమా పోస్టర్ వేలం..!
ఇండియాలో బిజీయెస్ట్ హీరోయిన్ ఎవరంటే..?
చైతూ-సాయిపల్లవి ‘లవ్‌స్టోరీ’ విడుదల వాయిదా
కీలక స్థానానికి చిరంజీవి రాజీనామా..?
యూత్‌ఫుల్‌గా ‘రౌడీ బాయ్స్’ మోషన్ పోస్టర్
ముంబైలో ఖరీదైన ఇంటిని కొన్న సన్నీలియోన్
పూజాహెగ్డే డిఫరెంట్ గ్లామర్ షేడ్స్..వీడియో వైరల్
విజయ్ సైకిల్ పై వెళ్లడానికి కారణమిదే..!
రష్మికకు మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్..వీడియో