గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 02, 2020 , 11:27:01

ప‌వ‌న్‌కు విషెస్ తెలిపిన చిరు, మ‌హేష్‌, వెంకీ, బ‌న్నీ

ప‌వ‌న్‌కు విషెస్ తెలిపిన చిరు, మ‌హేష్‌, వెంకీ, బ‌న్నీ

బాక్సాఫీస్ రికార్డుల రారాజు ప‌వ‌న్ క‌ళ్యాణ్ త్వ‌ర‌లో వ‌కీల్ సాబ్‌తో ప్రేక్షకుల‌ని ప‌ల‌క‌రించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ రోజు ప‌వ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుద‌లైన వ‌కీల్ సాబ్ మోష‌న్ పోస్ట‌ర్ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిస్తుంది. ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా ప‌వ‌న్ లుక్‌పై ప్రశంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.  అయితే నేడు 50వ బ‌ర్త్‌డే జ‌రుపుకుంటున్న ప‌వ‌న్‌కు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో పాటు అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. 

తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే ..మార్గాలు  వేరైనా గమ్యం ఒక్కటే  .. తన గుండెచప్పుడు ఎప్పుడు జనమే .. తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే.. జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. కళ్యాణ్ బాబు హ్యాపీ బ‌ర్త్‌డే అంటూ చిరు ట్వీట్ చేశారు.

మాన‌వ‌త్వం ఉన్న మంచి మ‌నిషికి, నా ఫ్రెండ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు. ఈ ఏడాది ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను అని వెంకీ త‌న ట్వీట్ ద్వారా తెలిపారు. 

ఇక సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. గ‌తంలో ప‌వ‌న్‌తో దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. హ్యాపీ బ‌ర్త్‌డే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌!! మీ ద‌యాగుణం, విన‌యం ఎల్ల‌ప్పుడు కొత్త మార్పుని ప్రేరేపిస్తాయి. ఎల్ల‌ప్పుడు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను అని మ‌హేష్ పేర్కొన్నారు. అల్లు అర్జున్, సాయి ధ‌ర‌మ్ తేజ్, శిరీష్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా ప‌వన్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.
logo