శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 24, 2020 , 13:03:46

ఆడ‌పడుచుల‌కు చిరు బ‌తుక‌మ్మ పండుగ శుభాకాంక్ష‌లు

ఆడ‌పడుచుల‌కు చిరు బ‌తుక‌మ్మ పండుగ శుభాకాంక్ష‌లు

తెలంగాణ అస్తిత్వం, ఆభ‌ర‌ణం .. ప‌ల్లె బతుకుల పూల సంబురం స‌ద్దుల బ‌తుక‌మ్మ పండుగ నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది. తీరొక్క పువ్వలతో లొగిళ్లు పూల వనాలుగా మారనుండగా.. ఉయ్యాల పాటలతో మార్మోగనున్నాయి. ఆత్మీయ‌త‌కు అనుబంధానికి అద్దం ప‌ట్టేలా మ‌హిళ‌లంద‌రు బ‌తుక‌మ్మ‌ల‌తో ఓ చోట చేరి ఆట‌పాట‌ల‌తో సంద‌డి చేయ‌నున్నారు. శీతాకాలపు తొలి రోజుల పువ్వులనే దేవుళ్లుగా భావించి పూజించడం తెలంగాణలో విశేషం.

బతుక‌మ్మ పండుగ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆడప‌డుచులంద‌రికి త‌న ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు. బతుకమ్మ  సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపు కొంటున్న నా ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైనది. మహిళలు ప్రకృతితో, దైవంతో, పుట్టిన నేలతో మమేకమయ్యే శుభ సందర్భం ఇది. మీరు, మీ కుటుంబసభ్యులు అందరూ ఆనందంగా ఉండాలని   కోరుకొంటున్నాను  అని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు చిరు.