గురువారం 28 మే 2020
Cinema - Apr 29, 2020 , 13:01:17

డ్యాన్స్ మెడిటేష‌న్‌లా ప‌ని చేస్తుంది: చిరంజీవి

డ్యాన్స్ మెడిటేష‌న్‌లా ప‌ని చేస్తుంది:  చిరంజీవి

ఈ రోజు ఏప్రిల్ 29... అంటే అంత‌ర్జాతీయ డ్యాన్స్ దినోత్స‌వం. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి త‌న‌కి డ్యాన్స్‌కి త‌న‌కి ఉన్న ప్ర‌త్యేక‌మైన అనుబంధాన్ని వీడియో ద్వారా గుర్తు చేసుకున్నారు. సంగీతం వలె, డాన్స్ కూడా ధ్యానంలా ప‌ని చేస్తుంది. ఎలాంటి మాన‌సిక స్థితిలో ఉన్నా కూడా డ్యాన్స్ మ‌నకి మంచి ఉప‌శ‌మ‌నం ఇస్తుంది. ఒత్తిడిని త‌గ్గిస్తుంది. ఇలాంటి స‌మ‌యాల‌లో మ‌నమంద‌రం ఒత్తిడిని పోగొట్టుకునేందుకు నృత్యం చేయాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంద‌ని చిరు పేర్కొన్నారు 


logo