శుక్రవారం 29 మే 2020
Cinema - Apr 10, 2020 , 12:26:14

పోలీస్ వారికి నా సెల్యూట్ : చిరంజీవి

పోలీస్ వారికి నా సెల్యూట్ :  చిరంజీవి

క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డిలో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం 21 రోజుల లాక్‌డౌన్‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ లాక్‌డౌన్ స‌జావుగా సాగేలా పోలీస్ వారు చేస్తున్న నిరంత‌ర కృషిపై సినీ సెల‌బ్రిటీలు ప్ర‌శంస‌ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్ప‌టికే పోలీస్ వారి త్యాగాన్ని గుర్తించి వారికి నాగ చైత‌న్య‌, మ‌హేష్ బాబు సెల్యూట్ చేయ‌గా, తాజాగా మెగాస్టార్ చిరంజీవి .. పోలీస్ బిడ్డ‌గా పోలీస్ వారికి సెల్యూట్ చేస్తున్నాన‌ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల ప‌నితీరు అద్భుతం. నిద్రాహారాలు మాని వాళ్ళు ప‌డుతున్న క‌ష్టం అంతా ఇంతా కాదు. నేను హైద‌రాబాద్‌లో స్వ‌యంగా చూస్తున్నాను. వారి ప‌నితీరు వ‌ల‌న లాక్‌డౌన్ స‌క్సెస్ ఫుల్ గా జ‌రుగుతుంది. అలా జ‌ర‌గ‌బ‌ట్టే క‌రోనా విజృంభ‌ణ చాలా అదుపులోకి వ‌చ్చింది. అలాగే సామాన్య జ‌నం కూడా పోలీసులకి స‌హ‌కరించాలి.కరోనాని అంత‌మొందించేందుకు వారికి చేదోడు వాదోడుగా ఉండాలి. పోలీస్ వారు చేస్తున్న ఈ అమోఘ‌మైన ప్ర‌య‌త్నాన్ని పోలీస్ బిడ్డ‌గా వారికి సెల్యూట్ చేస్తున్నాను అని చిరంజీవి త‌న ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo