శనివారం 06 జూన్ 2020
Cinema - Apr 27, 2020 , 16:49:50

రేపు ఉద‌యం సస్పెన్స్‌కి తెర తీస్తానంటున్న చిరు

రేపు ఉద‌యం సస్పెన్స్‌కి తెర తీస్తానంటున్న చిరు

మెగాస్టార్ చిరంజీవి త‌న సినిమాల‌తోనే కాదు సోష‌ల్ మీడియాలో చేసే పోస్ట్‌ల‌తోను ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తున్నారు . ఒక‌వైపు కరోనాకి సంబంధించి తీసుకోవ‌ల‌సిన జాగ్ర‌త్త‌లు చెబుతూనే మ‌రోవైపు ఫ్యామిలీ విష‌యాలు, సినిమా సంగ‌తులు షేర్ చేసుకుంటున్నారు. తాజాగా చిరు త‌న ట్విట్ట‌ర్ ద్వారా రేపు ఉద‌యం 9గం.లకి కార‌ణం ఏంటో చెబుతాన‌ని ట్వీట్ చేశారు.

చిరు తాజాగా చేసిన ట్వీట్‌లో.. సాధారణంగా, మేము పాటలు షూట్ చేసినప్పుడు, నేను  వాటిని పూర్తిగా వినేందుకు ఆనందిస్తాను. బ్రేకుల‌ని ఏ మాత్రం  ఇష్టపడను. కానీ ఇటీవలి కాలంలో  నేను ఒక పాటను పాజ్ చేయడం మరియు తిరిగి ప్రారంభించడంలోనే ఎక్కువ ఆనందం పొందుతున్నాను. అందుకు కార‌ణం ఏంట‌నేది రేపు ఉదయం 9గం.ల‌కి చెబుతాను అని త‌న ట్వీట్‌లో చిరు పేర్కొన్నారు. దీంతో అభిమానులు చిరు ఏ కార‌ణం చెప్తారా అని తీవ్ర ఆలోచ‌న‌లో ప‌డ్డారు


logo