శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Apr 28, 2020 , 17:27:09

క్రికెట్ ప‌రిభాష‌లో స‌చిన్‌కి స‌మాధాన‌మిచ్చిన చిరు

క్రికెట్ ప‌రిభాష‌లో స‌చిన్‌కి స‌మాధాన‌మిచ్చిన చిరు

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న చిరు త‌ను చేసే ప్ర‌తి ట్వీట్‌తో నెటిజ‌న్స్‌కి కావ‌ల‌సినంత ఫ‌న్ అందిస్తున్నారు. ఈ రోజు ఉద‌యం త‌న మ‌న‌వ‌రాలితో చేసిన సంద‌డికి సంబంధించిన  వీడియో షేర్ చేయ‌గా, ఇది నెటిజన్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇక కొద్ది సేప‌టి క్రితం స‌చిన్ ట్వీట్‌కి క్రికెట్ ప‌రిభాష‌లోనే స‌మాధాన‌మిచ్చి మెగాస్టార్ అనిపించుకున్నారు.

ఏప్రిల్ 24న‌ స‌చిన్ బ‌ర్త్‌డే కావ‌డంతో చిరంజీవి త‌న ట్విట్టర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. దీనికి కృత‌జ్ఞ‌త‌గా స‌చిన్ ..మీ అమూల్య‌మైన మాట‌ల‌కి ధ‌న్య‌వాదాలు..మీరంద‌రు క్షేమంగానే ఉన్నార‌ని ఆశిస్తున్నాను అని ట్వీట్ చేశారు. స‌చిన్ ట్వీట్‌కి స‌మాధానం ఇచ్చిన చిరంజీవి.. థ్యాంక్యూ బ్ర‌ద‌ర్ స‌చిన్‌.. అంతా క్షేమం. క‌రోనాతో జాగ్ర‌త్త‌గా ఉండ‌మ‌ని అంద‌రికి చెబుతున్నాను అంటూ క్రికెట్ పరిభాష‌లో ఢిఫెన్స్  ఈజ్ ది బెస్ట్ అఫెన్స్ అని ట్వీట్ చేశారు మెగాస్టార్. 


logo