బుధవారం 03 జూన్ 2020
Cinema - May 18, 2020 , 12:12:23

కాలం మారినా.. : చిరంజీవి

కాలం మారినా.. :  చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి లాక్ డౌన్ స‌మ‌యంలో సినిమాల‌తో అలరించ‌క‌పోయిన సోష‌ల్ మీడియాలో వెరైటీ పోస్ట్‌లు చేస్తూ అల‌రిస్తూ వ‌స్తున్నారు. తాజాగా ఆయ‌న 1990లో శ్రీమ‌తితో క‌లిసి వంట చేస్తున్న ఫోటోతో పాటు ప్ర‌స్తుతం కిచెన్‌లో బిజీ బిజీగా ఉన్న ఫోటోని షేర్ చేసారు. తాను..నేను. కాలం మారినా...దేశం మారినా ...అంటూ పోస్ట్‌కి కామెంట్ పెట్టారు. చిరు పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

చిరంజీవి ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌ని లైన్‌లో పెట్టారు. ఆయ‌న తాజాగా కొర‌టాల‌శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య అనే సినిమా చేస్తుండ‌గా, ఈ సినిమా సోష‌ల్ మెసేజ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతుంది. ఈ సినిమా త‌ర్వాత బాబీ, మెహ‌ర్ ర‌మేష్ వంటి యంగ్ డైరెక్ట‌ర్స్‌తో ప‌లు ప్రాజెక్టులు చేయ‌నున్నారు.logo