మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇద్దరిని కలిసి ఒకే ఫ్రేములో చూస్తే అభిమానులకు పూనకాలు గ్యారెంటీ. అయితే పలు సందర్భాలలో చిరు, పవన్‌లు కలిసి నటించడం, అలానే ఆడియో ఫంక్షన్స్‌లో ఒకే వేదికపై కనిపించడం జరిగింది. ఆ సమయంలో అభిమానుల ఆనందోత్సాహాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
తాజాగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన ట్విట్టర్లో ఫిలింఫేర్ కవర్ పేజ్‌పై చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు అన్యోన్యంగా ఉన్న ఫొటోని షేర్ చేశాడు. ఈ ఫొటోలో ఇద్దరు చాలా యంగ్‌గా కనిపిస్తుండగా, అభిమానులు ఈ పిక్కి ఫిదా అయి తెగ వైరల్ చేస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే సినిమాతో ఉండగా, ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. ఇక వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ చిత్రాలు చేస్తున్నాడు.