గురువారం 28 మే 2020
Cinema - May 10, 2020 , 12:10:02

మెగాస్టార్‌ని క‌దిలించిన అమ్మ ప్రేమ‌

మెగాస్టార్‌ని క‌దిలించిన అమ్మ ప్రేమ‌

మాతృదినోత్స‌వం రోజున త‌న త‌ల్లికి సంబంధించిన ఫోటోలు షేర్ చేసి శుభాకాంక్ష‌లు అందించిన చిరంజీవి తాజాగా మ‌రో వీడియో షేర్ చేశారు. ఇందులో ఓ పోలీస్ మ‌హిళ‌.. అంగ‌వైకల్యంతో బాధ‌ప‌డుతూ మ‌న‌స్థిమితం లేక రోడ్డు ప‌క్క‌న ఉన్న మ‌హిళ‌కి నోట్లో ముద్దలు క‌లిపి పెట్టింది. సోష‌ల్ మీడియాలో ఈ వీడియో తెగ చ‌క్క‌ర్లు కొట్ట‌గా, పోలీస్‌పై ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంసలు కురిపించారు. చిరంజీవి కూడా పోలీస్‌లోని అమ్మ త‌నాన్ని చూసి తెగ మురిసిపోయారు.

స‌ద‌రు పోలీస్‌తో స్వ‌యంగా కూడా మాట్లాడిన‌ట్టు చిరు త‌న వీడియోలో పేర్కొన్నారు. పోలీస్‌లు క‌ఠినంగా ఉంటార‌నేది అస‌త్యం. వారికి హృద‌యం ఉంటుంది అది కారుణ్యంతో ఉంటుంద‌నే విష‌యం తెలుసుకోవాలి అని చిరు స్ప‌ష్టం చేశారు.అయితే అభాగ్యురాలని అక్కున చేర్చుకొని అమ్మ ప్రేమ చూపించిన ఆ పోలీస్‌తో చిరు ఏం మాట్లాడార‌న్న‌ది త‌ర్వాత వీడియో ద్వారా తెలియ‌జేయ‌నున్నార‌ట‌.


logo