మంగళవారం 02 జూన్ 2020
Cinema - Apr 03, 2020 , 16:41:34

విలాస‌వంత‌మైన ఇంట్లో చిరు.. వీడియో వైర‌ల్‌

విలాస‌వంత‌మైన ఇంట్లో  చిరు.. వీడియో వైర‌ల్‌

ఆరు ప‌దుల వ‌య‌స్సులోను కుర్ర హీరోల‌కి పోటీ ఇచ్చే స‌త్తా చిరంజీవి సొంతం. 8 ఏళ్ళ త‌ర్వాత ఖైదీ నెం 150 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన చిరు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించాడు. ఆ సినిమాలో త‌న‌ గ్రేస్ , స్టైల్‌తో మ‌ళ్ళీ పాత రోజుల‌ని గుర్తుకి తెచ్చారు. ఇక ఉగాది ప‌ర్వ‌దినాన‌  సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చిరు త‌న అభిమానుల‌కే కాక నెటిజ‌న్స్‌కి ఫుల్ వినోదాన్ని పంచుతున్నారు.

ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రాముల‌లో అనేక విష‌యాలు షేర్ చేస్తూ వ‌స్తున్న చిరు తాజాగా జూబ్లీహిల్స్‌లోని  త‌న ఇంటి ద‌గ్గ‌ర నుండి తీసిన అంద‌మైన వీడియో షేర్ చేశారు. ఇందులో లాక్ డౌన్ సంద‌ర్భంగా సిటీ ఎంత ప్ర‌శాంతంగా ఉందో అని చెబుతూ.. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని చూపించారు. రోజూ మన పనుల్లో పడి గమనించడం లేదు కానీ మన నగరం చాలా ప్రశాంతంగా ఉంది. ప‌క్షుల ప‌లుకులు ఎంత స్వీట్‌గా ఉన్నాయి అని చిరు వీడియోలో పేర్కొన్నారు .

ఇక అదే వీడియోలో త‌న ఇంటిని కూడా కొద్దిగా చూపించారు. కొండపై అత్యంత విలాసవంతంగా క‌ట్టిన ఈ  ఇంటి ముందు పెద్ద లాన్.. పూల చెట్లు.. పెద్ద స్విమ్మింగ్ పూల్.. ఆ పక్కనే కార్లు.. దాంతో పాటే ఇంద్రభవనం లాంటి ఇల్లు అన్నీ ఆ వీడియోలో బాగా కనిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. రెండేళ్ల పాటు జూబ్లీ హిల్స్‌లోనే ఓ ఇంట్లో రెంట్‌కు ఉన్న మెగాస్టార్.. ఇటీవ‌ల‌ తన సొంతింట్లోకి మారిపోయాడు. పాత ఇంటిని పూర్తిగా రెన్యువేష‌న్ చేయించుకున్నారు . 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు, క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo